Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేం నిధులిస్తే...మీరు కమిషన్లు తీసుకుంటారా?: టీఆర్ఎస్ కవితకు కేంద్ర మంత్రి ప్రశ్న

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిలకు పరపతి ఉంటే 20 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలని, అలా తీసుకువస్తే తానే ఓటేస్తానని టీఆర్ఎస్ ఎంపీ కవిత పేర్కొనడంపై కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు నుంచి వస్తున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారని నిలదీశారు. బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే...మీరు కమిషన్లు తీసుకుని వెనకేసుకుంటారా? అని ప్రశ్నించారు. అన్నీ కేంద్రమే చేస్తే, ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన అడిగారు. మీరు డబ్బులు తీసుకురండి అని అడగడం మాని, సమర్థవంతమైన పరిపాలన సాగించాలని ఆయన హితవు పలికారు.

More Telugu News